30 April, 2026 | 4:06 PM

మాటూర్ గ్రామంలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

30-04-2026 03:05 PM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 30 (విజయ్ క్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో కార్యక్రమం  మండలంలోని మాటూర్ గ్రామంలో శాస్త్రవేత్తలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి, డాక్టర్ రేవంత్  నాదన్ పాల్గొని రైతులకు వివిధ అంశాలపై యూరియా వాడకం తగ్గించడం,విరివిగా రసాయనాలు వాడడం వల్ల కలిగే నష్టాలు,పంట మార్పిడి, నీటి ఆద, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల వాడకం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శోభ, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్,ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఠాగూర్,గ్రామ సర్పంచ్ భాగ్య సతీష్,ఉప సర్పంచ్ సత్యనారాయణ, కార్యదర్శి రవీందర్,రైతులు సుభాష్ రెడ్డి,రామ్ రెడ్డి, సాతల్లి రాములు,మల్లయ్య, గంగారం,చిరంజీవి అధికారులు పాల్గొన్నారు.