5 May, 2026 | 8:03 PM

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి

05-05-2026 06:47 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా అటవీ అధికారి సీహెచ్. బాలమణి (IFS) మంగళవారం జిల్లా కలెక్టర్‌ హరితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ సంరక్షణ చర్యలు, వృక్షారోపణ కార్యక్రమాల పురోగతి, అటవీ అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలపై కలెక్టర్‌తో చర్చించారు. అటవీ ప్రాంతాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, పచ్చదనం పెంపు కోసం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.