6 July, 2026 | 1:20 AM

బోనం ఎత్తిన నగర మేయర్ కొలగాని

06-07-2026 12:26 AM

ముకరంపుర, జూలై 5 (విజయ క్రాంతి)కరీంనగర్ నగరంలోని భగత్నగర్ మరియు రామచంద్రపురి కాలనీలలో ఘనంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని, సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనంద దాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, నాంపల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మి మొండయ్య, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు ప్రజలు పాల్గొన్నారు.