గణపవరం మేజర్ తూముకు మరమ్మతులు చేయించాలి
06-06-2026 03:05 PM
కౌలురైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి
కోదాడ జాన్ 06, కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మి పురం బికియా తండాఎన్ఎస్పి ముత్యాల బ్రాంచ్ ఎల్ 5 గణపవరం మేజర్ పై బీకియా తండా పెద్దమ్మ గుడి వద్దతూమ్ నెంబరు 7 కు వెంటనే మరమ్మతులు చేయించాలని కౌలురైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా శిథిలమై పునరుద్ధరణ చేయకుండా ఉండడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ తూము ద్వారా దాదాపుగా 30 ఎకరాలు పారుగడి ఉన్నది తక్షణమే ఈ తూము పునరుద్ధరణ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఎన్ఎస్పీ అధికారులను కోరారు.






