బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
బోథ్, జూన్ 6 (విజయ క్రాంతి): బడి ఈడు ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యతగా భావించి చదివించాలని గుర్రాల తండా గ్రామ సర్పంచ్ కటారి దినేష్ సింగ్ పేర్కొన్నారు. శనివారం గ్రామంలో ప్రత్యేక అధికారి ప్రేమ్ సింగ్ డిప్యూటీ తాసిల్దార్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక పై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో బడి పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు సురక్షితమైన తాగునీటిని వినియోగించుకోవాలని సీజనల్ వ్యాధుల నుండి కాపాడుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు ఆర్ఐ శ్యాంసుందర్ రెడ్డి డిసిసి కార్యదర్శి ప్రధానోపాధ్యాయులు దీపక్ ఉపాధ్యాయురాలు గీతా వాణి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఆశ వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు






