అమెరికాలో గౌతమ్ ఆదానీకి ఊరట
కేసును ఉపసంహరించుకోనున్న అమెరికా న్యాయశాఖ!
వాషింగ్టన్, మే 14 : గౌతమ్ అదానీపై ఉన్న 265 మిలియన్ డాలర్ల మోసం కేసులను ముగించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా లో కథనాలు పేర్కొన్నాయి. భారత అతిపెద్ద సౌర విద్యు త్ ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 265 మిలియన్ల డాలర్ల అవినీతి పథకంలో భాగంగా గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ మోసం, లంచం అభియోగాలను అమెరికా న్యాయ శాఖ ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం.
ఆదానీ, దాని అను బంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ల డాలర్ల లబ్ధిపొందేలా సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభు త్వ అధికారులకు సు మారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఆఫర్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అంతర్జాతీయ మీడి యాలో కథనాల ప్రకారం.. భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై ఉన్న మోసపూరిత ఆరోపణలను పరిష్కరించేందుకు అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.






