15 May, 2026 | 3:06 AM

హోర్ముజ్‌లో భారత నౌకపై డ్రోన్‌దాడి

15-05-2026 12:47 AM

ప్రాణాలను రక్షించుకున్న 14 మంది సిబ్బంది

న్యూ ఢిల్లీ, మే 14: హోర్ముజ్ జలసంధిలో భారత్ నౌకపై డ్రోన్‌దాడి జరిగింది.  సోమాలియాలోని బెర్బెరా నుంచి షార్జాకు వస్తున్న ఈ నౌక ఒమన్‌లోని లీమా సమీపంలో ఓ డ్రోన్‌దాడి చేయడంతో భారీపేలు డు సంభవించి మంటల్లో చిక్కుకుంది. అనుమానిత డ్రోన్ దాడి వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే అప్పటికే నౌకలోని 14మంది భారత సిబ్బంది లైఫ్‌బోట్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.

వీరిని రక్షించామని, దిబా పోర్టుకు తరలించామని ఒమన్ నావికాదళం రక్షించినట్లు ప్రకటించింది. అయితే దాడి ఎవరు చేశారనేది తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఒమన్ పోలీసులు ప్రకటించారు. వాణిజ్యనౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత నావికులను కాపాడిన ఒమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. పశ్చిమాసియా నుంచి ఓ ఎల్పీజీ నౌక హో ర్ముజ్ జలసంధిని దాటి భారత్‌కు వస్తుంది.