20 March, 2026 | 3:50 PM

పేదల సొంతింటి కల సాకారమే ప్రజాప్రభుత్వ లక్ష్యం

20-03-2026 12:00 AM

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ 

మిర్యాలగూడ, మార్చి 19 : పేద ప్రజల సొంతయింటి కలను సాకారం చేయడమే తెలంగాణ ప్రజాప్రభుత్వం లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నా రు. గురువారం ఉగాది పండుగ సందర్భం గా నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు లబ్ధిదారులు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ప్రారం భించి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా ప్రభు త్వం ఏర్పాటైన రెండున్నర సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.

త్వరలో పట్టణ ప్రాంత పేదలు మరో 2500 ఇండ్ల నిర్మానానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదల అభివృద్ధి విస్మరించి కమిషన్ల కోసం రా ష్టాన్ని అప్పుల కుప్పగా మార్చింది అన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు సన్నబియ్యo, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ధీరావత్  స్కైలాబ్ నాయక్,  సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.