20 March, 2026 | 2:18 PM

మేడిపల్లిలో గృహిణి అదృశ్యం

20-03-2026 12:00 AM

మేడిపల్లి, మార్చి 19 (విజయక్రాంతి): గృహిణి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మేడిపల్లి  పరిధిలోని ధరణి కాలనీలో కేతావత్ నీలమ్మ  (36) కూలి పని చేసుకుంటూ తన భర్త సోమ్లా నాయక్, ఇద్దరు పిల్లలతో  గత కొన్ని నెలలుగా నివాసం ఉంటున్నది.

15వ తేదీ నాడు సోమ్లా నాయక్ మద్యం మత్తులో తన భార్యతో గొడవ పడగా, నీలమ్మ తన అన్న అయినా శ్రీనివాసులు ఇంటికి వెళ్తున్నానని తన ఇద్దరు పిల్లలకి చెప్పి వెళ్ళినది. కానీ నీలమ్మ  తన  అన్న ఇంటికి కూడా వెళ్లలేదు. ఈ విషయంపై శ్రీనివాసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగినది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ శంకరయ్య తెలిపారు.