14 May, 2026 | 3:28 AM

పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం

14-05-2026 02:25 AM

హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు

అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

పుదుచ్చేరి, మే 13: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్ బుధవారం రంగస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా పుదు చ్చేరిలో ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్ర మా ణ స్వీకారం చేసి  రంగస్వామి రికార్డు నెలకొల్పారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు, మిత్రపక్షాల నేతలు, ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త సీఎం రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై మరింతగా దృష్టి సారిస్తుందని, ప్రజా సంక్షేమం కోసం అవసరమైన అన్ని పథకాలను అమ లు చేస్తామని హామీ ఇచ్చారు.

పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యడంపై ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మో దీ స్పందించారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. ‘పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రంగస్వామికి అభినందనలు.

అక్కడ అభివృ ద్ధి ప్రస్థానాన్ని బలోపేతం చేసిన అనుభవజ్ఞుడైన, సమర్థవంతమైన పరిపాలకుడిగా ఆయ న తనదైన ముద్ర వేశారు. కొత్త మంత్రులు పురోగతికి దోహదపడతారని, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను’ అని ప్రధాన మంత్రి మోదీ పోస్టు చేశారు.