14 May, 2026 | 3:11 AM

బంగారం, వెండి దిగుమతులపై సుంకాల పెంపు

14-05-2026 02:07 AM
  1.   6 నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం
  2. అత్యధిక దిగుమతి బంగారంలో సెకండ్, వెండిలో ఫస్ట్ భారత్

న్యూ ఢిల్లీ, మే 13: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీటిపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ విధించారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకొనే రెండోదేశం భారత్, వెండి విషయంలో తొలిస్థానంలో ఉంటుంది.

సుంకాలు పెంచడం తో దేశీయ కొనుగోళ్లు మరింత డీలాపడే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా అభిప్రాయపడ్డారు. ఏటా 800 టన్నుల బంగారం వరకు వినియోగిస్తుంటే అందులో 90 శాతానికి పైగా దిగు మతి చేసుకుంటున్నాం. దీంతో విదేశీ మారక నిల్వల కొరత ఏర్పడుతుంది. 

ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చు: ఆర్బీఐ గవర్నర్ సంజయ్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషన్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఇరాన్ యుద్ధం కారణంగా ముడిచ మురు సరఫరాకు ఆటంకం ఏర్పడితే, ఆ భారాన్ని ప్రభుత్వం వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ప్రభు త్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చ మురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరల ను నియంత్రిస్తున్నాయన్నారు. ఇది ఎంతకాలం సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. చమురు ధరలు పెరిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, వస్తు రవాణా ఖర్చులపై ప్రభావం చూపుతుందన్నారు.