రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 21: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానంద చార్యుల ఆదేశానుసారం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు.
సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడానికి వారు చేసిన కృషి మరువలేనిది అన్నారు. కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆయన అడుగు జాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నివాళులర్పించిన వారిలో సర్పంచ్ కుంటిగొర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బాష్పోలు శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నాయకులు భౌరోజు ఉపేందర్, వార్డుసభ్యులు బన్వరి ఉపేందర్, కుంటిగొర్ల నాగమ్మ అవిలేను, నాయకులు గట్టయ్య, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సోమయ్య, కృష్ణ, వీరయ్య తదితరులు ఉన్నారు.






