బూడిద బారి నుంచి కాపాడలని వినతి
చిట్యాల, మే 21: రైస్ మిల్లు నుండి వెదజల్లే నల్లటి బూడిద, పొట్టు ఇతర కాలుష్యకారక పదార్థాల నుండి తమను కాపాడాలని కోరుతూ చిట్యాల పట్టణ కేంద్రంలోని ఎనిమిదో వార్డు ప్రజలు గురువారం మున్సిపల్ కమిషనర్ గురుస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు ద్వారా వచ్చే నల్లటి బూడిద, పొట్టు వల్ల తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ సమస్య గత ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని రాజకీయ పలుకుబడి తో రైస్ మిల్లు యాజమాన్యం తమ కాలనీ ని కాలుష్యకారక బూడిదతో ముంచెత్తుతుందని ఆరోపించారు.
ఈ సమస్యను పరిష్కరించి రైస్మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని మిల్లును పూర్తిగా మూసి వేయించాలని లేనిచో కాలనీవాసులం మిల్లు ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ జిట్ట రవి, పాల రమేష్, బోడ రమేష్, పిల్లి యాదయ్య, దేవస్థాన డైరెక్టర్ పాల భవాని, జిట్టా మంగమ్మ, పోకల సరస్వతి, కుక్కల అనిత, చింత నీలమ్మ, పాల ఈశ్వరమ్మ, జిట్టా నాగమ్మ పాల్గొన్నారు.






