‘రాహుల్ బంధు’ జోరు
- ప్రజలు తిడితే పైశాచికానందమా?
- గురుకుల విద్యార్థులు చనిపోయినా సీఎంకు సిగ్గు అనిపించడంలేదా
- ధాన్యం తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ లేదు
- పాలమూరు బిడ్డ.. ఆ జిల్లాకైనా మంచిచేశారా?
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సమస్యలు తెలియజేస్తుంటే తనకు పైశాచిక ఆనందం వస్తుందని రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు, ప్రతిపక్షాలు తిడుతుంటే తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల వలన అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే తనకు సంతోషం కలుగుతుందంటూ రేవంత్ రెడ్డి సంబరపడుతు న్నాడని విమర్శించారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదన్నారు.
కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా లేదా అని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతుల ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా లేదా అని కేటీఆర్ ప్రశ్నించా రు. ఇలా అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతుంటే వారి బాధలను చూసి ప్రభుత్వాన్ని మేము తిడితే ప్రతిపక్షాల తిట్లతో తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుంద ని బాహాటంగా చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు.
ఇంత నిస్సిగ్గుగా పైశాచిక ఆనందం పొందుతున్న సీఎంను ఏమనాలో ప్రజ లే నిర్ణయించుకోవాలన్నారు. ప్రతిసారి నేను మారి న మనిషిని అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి యథావిధిగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. విద్యార్థులు కాలేజీ చదువులకు దూరమయ్యే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొన్నదని కేటీఆర్ అన్నారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకం గతంలో కాంగ్రెస్ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన మంచి పథకమని, బీఆర్ ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగించిందన్నారు.
కానీ ఈరోజు కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కాలేజీలకు రాకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో, మీరు కాలేజీ వాళ్లు తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకోవాలని తీర్పు ఇచ్చిందని, ఇలాం టి తీర్పు వచ్చిన తర్వాత విద్యార్థుల కాలేజీ చదువులు అంధకారంలో కూరుకుపోయినా కూడా ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యారంగానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి గురుకుల పాఠశాలల నుంచి ఫీజు రీయిం బర్స్‌మెంట్ వరకు అన్నిరంగాల్లో విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు.
ఆ జిల్లాకైనా మంచి చేశారా..
ఎవరు అధికారంలోకి వచ్చినా రైతు బంధు ఆగదని గతంలో కొందరు మాట్లాడారని, కానీ రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతుబంధు పూర్తిగా ఆగిపోయిందని, చివరికి రైతన్నలకు యూరియా బస్తాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. పండించిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మక్కలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నారని అన్నారు. రైతుల గురించి సీఎం స్పీచ్‌లు, డైలాగ్‌లు కొడుతున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డను, ప్రజల గోస తీరుస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి కనీసం మహబూబ్‌నగర్ జిల్లాకైనా ఒక్క మంచి పని చేశాడా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడని, కేసీఆర్ పరిపాలన గురించి తెలంగాణలో ఏ పల్లెను అడిగినా చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూ డు నెలల్లో అమలు చేస్తానని చెప్పి, 30 నెలల తర్వాత కూడా అవి అమలు చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. మూడు నెలలు కాదు, 30 నెలలైనా పథకాలు అమలు కాలేదంటే ఆ పథకాలనుగాని, ఆ వ్యక్తినిగాని ఏమనాలి అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ‘రాహుల్ బంధు’ జోరు..
పెండింగ్ ప్రాజెక్టుల్లో కనీసం పాలమూరు- ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయడం లేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టు కావడంతో దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతిసారి అప్పుల కారణంగా అభివృద్ధి చేయలేమని సాకులు చెబుతున్నారని, కానీ గత ప్రభుత్వం తెచ్చి న ప్రతి అప్పు ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించిందన్నారు.
కానీ ఈ ప్రభు త్వం మూడు లక్షల 80 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఒక్క రూపాయి పనీ చేయలేదన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి రైతుబంధు వంటి పథకాలను పక్కనపెట్టి ‘రాహుల్ బంధు’ను మాత్రం జోరుగా నడిపిస్తున్నారని కేటీఆర్ అన్నా రు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన నాయకుడు కేసీఆర్ అని, కాంగ్రెస్ లాగా 420 అబద్ధపు హామీలతో ప్రజలను కేసీఆర్ ఎప్పుడూ మోసం చేయలేదని తెలిపారు.
మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతుల సంక్షేమం కోరి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 11 విడతల్లో రూ. 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి వేశామని గుర్తుచేశారు. గతంలో కొందరు రైతు బంధు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని హేళనగా మా ట్లాడారని, మరి ఇవాళ రాష్ట్రంలో రైత బంధు పరిస్థితి ఏమైందో వారు సమాధానం చెప్పాలని నిలదీ శారు.
కత్తి వారికిచ్చి యుద్ధం మాత్రం మమ్మల్ని చేయమంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్రం లో ప్రస్తుతం బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా సామాన్యుడి దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.






