1 May, 2026 | 7:19 AM

ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో సీఎంఆర్ ప్రభంజనం

01-05-2026 02:01 AM

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో బోయినపల్లి సీఎంఆర్ హైస్కూల్‌లో రసూరి అక్షిత్ 585 మార్కులతో విజయ ఢం కా మోగిస్తూ జిల్లా, మండల స్థాయిలో అత్యున్నత స్థానాన్ని పొంది, పాఠశాలలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

మిగతా విద్యార్థులు కూడా 100% ఫలితాలు సాధించి మండలంలో వివిధ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. వీరిలో శుభం కేడియా 562, సఫూరా బేగం 562, లకోజు హరిచందన 560, ఖుషి సింగ్ చౌహన్ 560, మదగోని అక్షర 555, మ్యా కల భువనప్రియ 552, మౌనిక కుమారిమెహ్రా 552, బుచ్చమ్మ గారి లక్ష్మీప్రియా యాదవ్ 551, కొక్కొండ యోగిత 551, అమన్ వర్మ 550, సయ్యద్ జైనా హర్మైన్ 550, ఎస్తర్ నిరీక్షణ 549, అభయ్‌సింగ్ చౌహన్ 549, లేవడల హుస్సేన్ వల్లి 548, కొడమంచిలి గాయత్రి 548, రేఖ కచ్చావ 547, హానియా ఫాతిమా 546, వల్లేపు పుష్పశ్రీ 546, మహమ్మద్ ముజాకిర్ 545. కాగా మొత్తం 156 మంది విద్యార్థులలో 94 మంది 60 శాతం విద్యార్థులు ‘ఏ’గ్రేడ్‌ను సంపాదించారు.

సబ్జెక్ట వారీగా.. ప్ర థమ భాషలో 82, ద్వితీయ భాష లో 95, ఇంగ్లీష్‌లో 81, గణితంలో 95, సైన్స్(ఫిజిక్స్ బయో)లో 113, సోషల్ స్టడీస్‌లో142 మంది విద్యార్థులు ‘ఏ’ గ్రేడ్‌ను విజయవంతంగా సంపాదించుకు న్నారు. ఈ సందర్భంలో సీఎంఆర్ సెక్రటరీ కరస్పాండెంట్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రణాళికబద్దమైన పర్యవేక్షణ, ప్రత్యే క తరగతుల నిర్వహణ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విద్యార్థులకు తగిన ప్రేరణ, ప్రోత్సాహాలతో కూడిన దిశా నిర్దేశనం చేయ డం ద్వారా మంచి ఫలితాలను సాధించారని హర్షం వ్యక్తపర్చారు. ఈ ఫలితాలు తమ పాఠశాలలపై తల్లిదండ్రులకు మంచి నమ్మకం కలిగిస్తుందని ఆశాభా వం వ్యక్తం చేస్తూ, విజేతలైన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యున్నత మా ర్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పా ఠశాల ఆవరణలో సీఎంఆర్ విద్యాలయాల అధినేత సి.గోపాల్‌రెడ్డి, డైరెక్టర్ ఎస్‌కే రెడ్డి, ప్రిన్సిపాల్ సునీత ధూళిపాళ ఘనంగా సన్మానించారు.  విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.