వినియోగదారులకు నాణ్యతమైన అభరణాలు అందించాలి
కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి
కామారెడ్డిలో ఎగ్జిబిషన్ అండ్ సెల్ ప్రారంభించిన వైస్ చైర్ పర్సన్
కామారెడ్డి, మార్చి 21 (విజయక్రాంతి): వినియోగదారులకు నాణ్యమైన అభరణాలను అందించాలని కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జోయాలుక్కాస్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ అండ్ సెల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వినియోగదారుల నమ్మకాన్ని చురగొన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు.
జోయాలుక్కాస్ కంపెనీ వారు వినియోగదారులకు నాణ్యమైన అభరణాలతోపాటు ఆధునిక కాలంలో మహిళల అభిరుచులకు తగ్గట్టుగా నాణ్యమైన అభరణాలను తయారుచేసినట్లయితే వ్యాపారం పెరుగుతుందన్నారు. నాణ్యమైన వస్తువులు ఇచ్చి వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. జోయాలుక్కాస్ నిజాంబాద్ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి సత్యా కన్వెన్షన్ లో మూడు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోయాలుక్కాస్ రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్, జోయాలుకాస్ కంపెనీ ప్రాంతీయ అధికారి సునీల్ పిఎస్, ప్రాంతీయ మేనేజర్ సిజ్జు సీజే, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కరుణాకర్, జోయాలుక్కా సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.




