26 April, 2026 | 3:14 AM

265.. ఊదేశారు

26-04-2026 01:34 AM

పంజాబ్ రికార్డు ఛేజింగ్

ప్రభ్‌సిమ్రన్, శ్రేయాస్ మెరుపులు

రాహుల్ సెంచరీ వృథా

7 బంతులు మిగిలుండగానే ఫినిష్

20 ఓవర్లలో 264/2... ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరిది.. ఇంత స్కోరు చేసిన తర్వాత గెలవకుండా ఉంటారని ఎవరైనా అనుకుంటారా ? ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా ఇంత భారీ లక్ష్యం ఛేదించడం అంత సులభం కాదు. కానీ పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయిన వేళ 265 రన్స్ టార్గెట్‌ను ఊదేసింది. అది కూడా మరో 7 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఎదురులేకుండా పోతోంది. వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. అది కూడా రికార్డుల మోత మోగి స్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదిం చింది. ఈ మ్యాచ్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా పరుగుల వరద పారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి సరైన ఆరంభం దక్కలేదు. నిస్సాంక మరోసారి నిరాశపరిచాడు.

అయితే నితీష్ రాణా, కేఎల్ రాహుల్ తర్వాత విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లేలో 68 పరుగులు చేసిన పంజాబ్ తర్వాత చెలరేగిపోయింది. రాహుల్, రాణా దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్ లోకి పంపిస్తూనే ఉన్నారు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియం బౌండరీలు, సిక్సర్లతో తడిసిముద్దయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 95 బం తుల్లోనే 220 పరుగులు జోడించారంటే వారి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అ ర్థం చేసుకోవచ్చు.

నితీష్ రాణా 44 బంతు ల్లో 91 (11 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. రాహుల్ 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ ఐపీఎల్ కెరీర్ లో ఇదే ఆరో సెంచరీ. శతకం తర్వాత మరిం త దూకుడుగా ఆడిన రాహుల్ ఢిల్లీకి 264 పరుగుల భారీస్కోరు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. కెఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 (16 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ పక్కా వ్యూహంతో ఆడింది.

ఫ్లాట్ పిచ్ కావడంతో పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసింది. ఓపె నర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ సిక్సర్లతోనే పవర్ ప్లేలో హోరెత్తించారు. భారీ షాట్లతో విరుచుకు పడ్డారు. ఫలితంగా పవర్ ప్లేలో నే పంజాబ్ కింగ్స్ వికెట్ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. ముకేశ్ కుమార్ వేసిన ఆరో ఓవర్లో ప్రభ్ సిమ్రన్ వరుసగా ఆరు ఫోర్లు బాదాడు. తొలి వికెట్ కు వీరిద్దరూ 126 పరుగులు జోడించగా ప్రియాన్ష్ ఆర్య (43) పరుగులకు ఔటయ్యాడు. తర్వాత కూపర్ కన్నోలీ (17),  ప్రభ్ సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 76 (9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔటయ్యారు.

దీంతో పంజాబ్ టార్గె ట్ ఛేజ్ చేయగలదా అనిపించింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ మరోసారి విధ్వం సం సృష్టించాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. శ్రేయాస్ కేవలం 36 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ దూకుడుతో పంజా బ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదిం చింది. టీ20 చరిత్రలోనే ఇదే అత్యధిక ఛేదన. శ్రే యాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం కూడా ఢిల్లీ ఓటమికి కారణమైంది. 

స్కోరు బోర్డు 

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 264/2 ( కేఎల్ రాహుల్ 152 నాటౌట్, నితీష్ రాణా 91 ; అర్షదీప్ 1/49, బార్ట్‌లెట్ 1/69)

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 265/4 ( ప్రభ్‌సిమ్రన్ సింగ్ 76, శ్రేయాస్ 71, ప్రియాన్ష్ ఆర్య 43 ; కుల్దీప్ 2/46, విప్రజ్ 1/24)