27 April, 2026 | 5:10 AM

రఘువంశీ ఔట్‌పై వివాదం

27-04-2026 01:41 AM

లక్నో, ఏప్రిల్ 26: లక్నో సూపర్‌జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రఘువంశీ ఔట్ వివాదాస్పదమైంది. క్రికెట్లో అరుదుగా కన్పించే అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ (ఫీల్డింగ్‌కు ఆ టంకం కలిగించడం) నిబంధన ప్రకారం రఘువంశీ ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఈ రూల్‌తో ఔటైన నాలుగో బ్యా టర్‌గా రఘువంశీ నిలిచాడు. పిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రఘువంశీ సింగి ల్ కోసం ప్రయత్నించాడు.

అయితే షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వ చ్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికె ట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. పంత్ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో అతడిని అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్  కింద అవుట్‌గా ప్రకటించారు.