ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, ఏప్రిల్ 30: ప్రజాసంక్షేమం ప్రభుత్వ ధ్వేయమని.. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న వేశవిలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపి, ఫ్యాక్స్ వరి ధాన్యం కేంద్రాలలో రైతులకు ఇబ్బంది లెకుండా చూడాలన్నారు.
ధాన్యంను కోనుగోలులో ఆన్ లైన్ లో నెలకోన్న ఇబ్బందుతో అఫ్లైన్ ద్వార కోనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పురొగతిని పరిశీలించాలని.. త్వరాగ ఇండ్లు పూర్తి అయ్యోట్లు లద్దిదారులను ప్రోత్సహించాలని అధికారులను అదేశించారు. బడిబాటతో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యశాఖ అధికారులకు సూచించారు. వర్షాకాలం అరంభంలో వన మహోత్సవం ద్వార విరివిగా మొక్కలు నాటాలన్నారు.
మండల వ్యాప్తంగా 335 ఎకరాలలో అయిల్ ఫామ్ సాగు జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో 50 ఎకరాలు సాగు అయ్యోవిదంగా సమావేశాలు నిర్వహించి సర్పంచ్ లు సహకరించాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. విద్యుత్ అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో పరిశీలించి లూజ్ విద్యుత్ వైర్లను పున:రుద్దరించాలన్నారుప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు. సమీక్షకు ముందుగా మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ .. వరి ధాన్యం కోనుగోలు పర్యావేక్షణకు గ్రామంలో ఐదుగురు చోప్పున కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గ్రామంలోని ప్రధాన సమస్యలు తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరంకు కృషి చేస్తానని మంత్రి హామి ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యర్థుల సంఖ్యను పెంచాలన్నారు. రానున్న వర్షకాలంలో ప్రతి ఒక్కరు మొక్కను నాటాలని సూచించారు.
మండలంలోని ప్రతి గ్రామంకు ఆర్వీఏం మెడికల్ కాలేజీ ద్వార హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నమని.. ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య, ఏఎంసీ చైర్మన్ నిర్మల, డిపిఒ రవిందర్, ఎంపిడిఓ కృష్ణయ్య, తహసీల్ధార్ నవిన్ కుమార్, ధర్మయ్య, సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.






