31 March, 2026 | 9:18 PM

ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

31-03-2026 07:29 PM

గ్రామ సర్పంచ్ బచ్చలకూరి శ్రీను

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బచ్చలకూరి శ్రీనివాస్ గ్రామ ప్రజలను కోరారు.మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు, గ్రామ అభివృద్ధి కమిటీ విన్నపం మేరకు గ్రామస్తుల సౌకర్యార్థం కల్మలచెరువు గ్రామం నుండి వివిధ ప్రాంతాలు వెళ్లడానికి మిర్యాలగూడ డిపో నుండి మఠంపల్లి వరకు వయో కల్మలచెరువు మీదుగా బస్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు.

ఉదయం సాయంత్రం రెండు టిప్పులు బస్సు నడుస్తుందని మిర్యాలగూడ డిపో నుండి నేరేడ్చర్ల గరిడేపల్లి గారకుంట తండా, కల్మలచెరువు వైపు హనుమంతుల గూడెం, యాతవాకిల, బిలియా నాయక్ తండ, మఠంపల్లి వరకు రెండుసార్లు ఉదయం సాయంత్రం బస్సు నడుస్తుందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

మండలంలోని అత్యధిక జనాభా కలిగిన చుట్టుపక్కల గ్రామాలు తండాలు కలిగి ఉన్నాయని మేజర్ గ్రామపంచాయతీ అయిన కల్మలచెరువు గ్రామానికి గత కొన్ని ఏండ్లుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పట్టడం జరిగిందని తెలిపారు.విద్యార్థులు గ్రామస్తులు వ్యాపారస్తులు సౌకర్యార్థం బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నల్గొండ రీజినల్ మేనేజర్ కొనతం జాన్ రెడ్డి గ్రామ సర్పంచ్ గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు