31 March, 2026 | 9:14 PM

పట్టణ అభివృద్ధికి సహకరించండి

31-03-2026 07:32 PM

- మున్సిపల్ సమావేశంలో వాడివేడిగా చర్చ 

బైంసా,(విజయక్రాంతి): పట్టణ అభివృద్ధికి మున్సిపల్ సభ్యులు అధికారులు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రేయ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 2026 27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. చైర్మన్ దత్తాత్రి మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి అన్ని విధాల సహకరించాలని కోరారు. మున్సిపల్ మేనేజర్ గౌరీష్ బడ్జెట్ వివరాలు తెలుపుతూ 2026 27 ఆర్థిక సంవత్సరానికి 12.10 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

సందర్భంగా వివరాలు వెల్లడిస్తుండగా పట్టణ ప్రగతికి ఒకటి 1.50 నిధుల గురించి ప్రస్తావించగా ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ జాబీర్ అహ్మద్ మాట్లాడుతూ... అసలు ఆ పథకమే లేదని నిధులు ఎలా వస్తాయని అధికారులను నిలదీశారు. దీంతో కమిషనర్ నవీన్ అధికారులు తడబడ్డారు. ఈ విషయమై సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

కలెక్టర్ సంతకంతో తమకు వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్ది విరామం అనంతరం తిరిగి సమావేశాన్ని కొనసాగించారు. ఎజెండాలోని 9 అంశాలను ప్రస్తావించి ఆమోదించారు. సమావేశంల మహమ్మద్ జాబీర్ అహ్మద్ వార్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బిబి ఖతీజ , వార్డు సభ్యులు డి ఈ ఈ సంతోష్ పాల్గొన్నారు.

* ప్రజా పాలన నిధులు 

బడ్జెట్ పద్దులో పట్టణ ప్రగతి నిధులు కావని అవి ప్రజాపాలన సంబంధించినవని మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రి సమావేశా అనంతరం విలేకరులకు వివరించారు.