31 March, 2026 | 9:15 PM

బీసీ బాలికల గురుకుల పాఠశాలపై నిఘా పెంచాలి

31-03-2026 07:26 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): దామరచర్ల బిసి బాలికల గురుకుల పాఠశాల నిర్వాహకులపై నిఘా పెంచాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఎండి షోయబ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.  పాఠశాల సిబ్బంది విద్యార్థినుల పట్ల అమానవీయ ప్రవర్తన  మెనూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.