25 July, 2026 | 3:14 AM

తార్నాకలో బీజేపీ నాయకుడు శ్రీరామ్ వెంకటేష్ ఫ్లెక్సీల చించివేత

25-07-2026 02:38 AM

ముదిరిన గ్రూపు రాజకీయాలపై చర్చ

సికింద్రాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తార్నాక డివిజన్లో బీజేపీ అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారా యి. యువ బీజేపీ నాయకుడు డాక్టర్ శ్రీరా మ్ వెంకటేష్ ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగా కల్పిస్తూ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్కు సంబంధించిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం స్థానికంగా కలకలం రేపింది.

కొద్ది రోజులుగా డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై బిజెపి నాయకులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను మరో వర్గానికి చెందిన నాయకులు పనిగట్టుకుని చించి వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.

వారం రోజుల క్రితం తర్నాక లో పార్క్ ప్రారంభోత్సవానికి వస్తు న్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినీ స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లె క్సీల ను రాత్రికి రాత్రే చించి వే శారు. గత ఆదివారం అదే పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి వస్తున్న బీజేపీ నాయ కులను స్వాగతి స్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసి తొలగించారు.

కాగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకుకు తార్నాకలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల సమాచారాన్ని తెలియ యజేస్తూ పలు ప్రాంతాల్లో బిజెపి నాయకులు డాక్టర్ శ్రీరాం వెంకటేష్  దాదా పు 40కి పైగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిలో సగానికి పైగా గురువారం రాత్రి ఎక్కడి కక్కడ చించివేశారు . ఫ్లెక్సీలలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ కోసి వేశారు.ఫ్లెక్సీల చించివేత స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు?

వరుసగా ఇలా ఫ్లెక్సీలను చించి వేయడం కనుక ఎవరున్నారు? దీనికి రాజకీయ కక్షలే కారణ మా? లేక మరేదైనా అంశ మా? అనే కోణాల్లో చర్చ సాగుతోంది. ఈ ఫ్లెక్సీల చించివేత ను బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఫ్లెక్సీల చించి వేత వెనుక ఉన్నది ఎవరనే దానిపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

ప్రజాసేవను అడ్డుకునే ప్రయ త్నాలు మంచివి కావు : డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్

ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అ వగాహన కల్పిస్తూ, హెల్ప్డెస్క్‌ల ద్వారా సేవలు అందించేందుకు తార్నాకలో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు గుర్తుతెలియని వ్యక్తుల చేత ధ్వంసం చేయబడడం బాధాకరమని బీజేపీ నాయకు డు, ప్రముఖ సామాజిక సేవకు డు డా. శ్రీరామ్ వెంకటేష్ పేర్కొ న్నారు.ప్రజల కు సమాచారం అందించేందుకు, వారి సమస్యలను నమోదు చేసేందుకు, ప్రభుత్వ పథ కాలపై మార్గదర్శకత్వం ఇవ్వేందుకు ఏర్పా టు చేసిన హెల్ప్డెస్క్లను లక్ష్యంగా చేసుకో వ డం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

ఫ్లెక్సీలు చించివే యడం ద్వారా సేవా సంకల్పాన్ని ఎవరూ చించ లేరు. ఒక బ్యానర్ ను తొలగించవచ్చు, కానీ ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పాన్ని తొలగించడం ఎవరి వల్లా కాదు. ప్రజల విశ్వాసమే మా బలమన్నారు.హెల్ప్డెస్క్లకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే కొందరిలో అసహనానికి కారణమై ఉండవచ్చని ఆయన పేర్కొంటూ, అయిన ప్పటికీ ఎలాంటి ప్రతీకార రాజకీయాలకు తాము పాల్పడబోమని స్పష్టం చేశారు.