25 July, 2026 | 3:13 AM

దేవుని మాన్యం భూములు పేదలకే..

25-07-2026 02:38 AM

టీఆర్పి భారీ ధర్నా 

వీపనగండ్ల జులై 24. మండల కేంద్రంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం గుత్తాధిపత్యం నుంచి విడిపించి గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ మాట్లాడుతూ గ్రామంలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ దౌర్జన్యాన్ని ఇక సహిం చబోమని హెచ్చరించారు దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం తక్కువ లీజుతో  అనుభవిస్తుందని ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు సాగు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు

ప్రశ్నించిన వారిపై పోలీసు అధికారుల యంత్రంగానే అడ్డుపెట్టుకొని ఒత్తిడి తెస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ దేవుని భూములను పేదలకు సాగు కోసం అప్పగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిట్టల శేఖర్ సుశీల బిక్షపతి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ యాదవ్ కోట్ల వాసుదేవ్ గ్రామ ప్రజలు వివిధ పార్టీ నాయకులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.