25 June, 2026 | 3:01 AM

ఆగని దోపిడీ..!

25-06-2026 01:52 AM

ప్రైవేట్ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలుతోనూ రాబడి 

తప్పక కొనుగోలు చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తున్న యాజమాన్యాలు?

కోదాడలోని 59 పాఠశాలల్లో ఇదే పరిస్థితి! 

అక్షర పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మే గదిని సీజ్ చేసిన ఎంఈఓ 

ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రుల వేడుకోలు

సూర్యాపేట, జాన్ 24 (విజయక్రాంతి): పట్టణంలో గల వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలను విక్రయిస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తూన్నారు. పట్టణ పరిధిలో సుమారు 59 ప్రైవేటు పాఠశాల ఉండగా వాటిలో అనేకమంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వారిపై పుస్తకాలు పేరిట ఆర్థిక దోపిడీ చేస్తున్నారు.

ఒక్కో తరగతికి పాఠ్యపుస్తకాల మొత్తం ఖరీదు రూ.1500 వరకు ఉండగా వీటిని అమాంతం రూ 15000 వరకు పెంచేసి నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పుస్తకాలను మా పాఠశాలలోనే కొనాలని నిబంధన పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం అయినప్పటికీ అక్కడే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. సంవత్సరాల తరబడి ప్రైవేటు పాఠశాలల్లో ఈ పాఠ్యపుస్తకాల దోపిడి ఇలాగే కొనసాగుతుండడం గమనార్హం.

లక్షల విలువ చేసే పుస్తకాలు సీజ్

పట్టణంలోని కటకొమ్ముగూడెం రోడ్ లో గల అక్షర స్కూల్ లో ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలను అధిక రేట్లకు అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లి పాఠశాల యాజమాన్యంను నిలదీశారు.

దానికి పొంతన లేని సమాధానం చెప్పడంతో విషయమును అర్థం చేసుకున్న విద్యార్థి సంఘం నాయకులు సమాచారంను స్థానిక మండల విద్యాధికారికి అందించగా ఆయన అక్కడికి చేరుకుని స్కూల్లో తాళాలు వేసిన గదులను తెరిపించారు. వాటిలో లక్షల రూపాయల విలువైన నోటు బుక్స్, బుక్స్ రూమ్ లో భద్రపరిచారు. వెంటనే ఆ రూములను సీజ్ చేశారు.

తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారం

ప్రైవేట్ పాఠశాలలు అనుసరిస్తున్న విధానాలతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయ లేని ఆర్థిక భారం పెరుగుతుంది. ఓ పక్క విపరీతంగా పెరిగిన పాఠశాల ఫీజులకు తోడు మార్కెట్లో కేవలం రూ. 2 వేల లోపు విలువ చేసే పుస్తకాలను రూ.15 వేల నుండి 20వేల వరకు వసూలు చేస్తుండడం విద్యార్థుల తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారిపో యింది. అలాగే యాజమాన్యాలు తమ పాఠశాల పేరు వచ్చేలా పుస్తకాలు, నోటు పుస్తకాలను ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతున్నప్పటికీ వారిని అడ్డుకునే వారే కరువ య్యారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఒక ఆలోచనతో మాత్రమే అధిక భారమైనప్పటికీ తమ పిల్లలను తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకపోవడంతో వారిపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి అధిక రేట్లకు పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

పట్టణంలోని చాలా ప్రైవేట్ పా ఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ అంశంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

నవీన్, విద్యార్థి సంఘం నాయకులు 

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా చట్టపరమైన చర్య లు తీసుకుంటా ము. ప్రైవేటు పాఠశాలలు ఎవరైనా ఇక్కడే పుస్తకాలు కొనా లంటూ తల్లిదండ్రులను, విద్యార్థులను వేధించినా, పాఠశాలల్లో పుస్తకాలు అ మ్మిన ఫిర్యాదు చేస్తే తప్పకుండా ఆ యాజమాన్యాలపైచర్యలుతీసుకుంటాం.

సలీం షరీఫ్, 

మండల విద్యాధికారి, కోదాడ