20 April, 2026 | 11:05 PM

విద్యార్థినిల ఆరోగ్యానికి ప్రాధాన్యత

20-04-2026 09:58 PM

మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య

సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామంలో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ విద్యార్థినుల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ (మహిళా సాధికారత కేంద్రం) ఆధ్వర్యంలో ప్యాడ్ బర్నింగ్ మిషన్‌లను (ఇన్‌సినరేటర్స్) తరపున చేయగా మండల విద్యాధికారి కళారాణి, కళాశాల ప్రిన్సిపాల్ దుర్గాభవానిల చేతుల మీదుగా పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాలతో 'బేటీ బచావో - బేటీ పడావో' పథకం నిధులతో ఈ మిషన్లను అందించడం జరిగిందన్నారు. శానిటరీ ప్యాడ్లను ఇష్టానుసారంగా పారవేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతాయనీ, ఈ మిషన్ల ద్వారా వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగదన్నారు. విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ మిషన్లను అందజేయడం గొప్ప నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాళ్ళు లలిత. నవ్య, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.