20 April, 2026 | 11:19 PM

అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన

20-04-2026 09:56 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని తొమ్మిదవ వార్డు సుల్తాన్ పుర అంగన్వాడీ కేంద్రం లో పోషకాహారంపై గర్భిణీ, స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు సూపర్వైజర్ ప్రతిభ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, కిశోర బాలికలకు అందించే పోషకాహారంపై అవగాహన కల్పించామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లలు నేర్చుకున్న రైమ్స్ ను, పాటలను, కథలను తల్లుల ముందు పిల్లలతో చేయించారు. అనంతరం పిల్లలకు అసైన్మెంట్ కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది వ వార్డు కౌన్సిలర్ బొడ్ల వసుధ నగేష్, అంగన్ వాడి టీచర్ సఫియా బేగం, అంగన్వాడికి పిల్లలు, తల్లులు, గర్భిణీలు పాల్గొన్నారు.