18 April, 2026 | 4:16 AM

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలి

18-04-2026 01:37 AM

పాపన్నపేట,ఏప్రిల్17: ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని తపస్ జిల్లా కోశాధికారి మంగ నరసింహులు, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, రాజశేఖర్ లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాపన్నపేట తహసిల్దార్ సతీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సి తో పాటు పెండింగ్లో ఉన్న 5 డీఏలను, హెల్త్ కార్డులను ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు  తులసిరామ్, రమేష్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.