22-02-2026 11:58:06 AM
లక్షల కోట్లు నేలపాలు
పైకి ఉబికి వస్తున్న తారు
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల నాణ్యతలేని రోడ్డు గుల్ల. వెంకంపాడు గ్రామం నుండి తాళ్ల ఊకల్ గ్రామం వరకు కొత్తగా చేపట్టిన డమ్మర్(తారు) రోడ్డు నాణ్యత లోపం కోట్టుకొచ్చినట్లు తేట తెల్లమవుతుంది. రోడ్డు పోసిన మరుసటి రోజే రోడ్డు పగుళ్లతో గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదకరంగా మారింది.
ఈ పరిస్థితి తాళ్ల ఊకల్ గ్రామం నుండి వెంకంపాడు మార్గంలో చోటుచేసుకుంది. వెంకంపాడు తాళ్ల ఉకల్ మార్గం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. గ్రామవాసులు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్డు వేసిన మరుసటి రోజు పగుళ్లు గుంతలు ఏర్పడ్డాయని సంబంధిత అధికారులు సదరు కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.