10 July, 2026 | 2:08 AM

రోడ్ల ఆక్రమణలపై పోలీసు శాఖ చర్యలు

10-07-2026 01:06 AM

ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే చర్యలు 

నిర్మల్ జులై 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్లపై అక్రమంగా వాహనాలు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. నిర్మల్ పట్టణంలోని స్థానిక బస్టాండ్ వివేక్ చౌరస్తా మంచిర్యాల చౌరస్తా ఆర్డిఓ ఆఫీస్ జూనియర్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా వ్యాపారం చేసుకుంటూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారని ఫిర్యాదుతో ఈ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జన సంచారం ఉన్న ప్రదేశాల్లో రోడ్లలో ఆక్రమించుకొని దుకాణాలు ఏర్పా టు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ సిఐ సమ్మయ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు.