పారదర్శకంగా ఓటర్ జాబితా
10-07-2026 01:04 AM
ఎస్‌ఐఆర్ సర్వే పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్ జులై 9 (విజయక్రాంతి): ఖానాపూర్ కేంద్రంలోని మున్సిపల్ 11వ వార్డ్ లో SIR సర్వేలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ఫారమ్స్ నీ పరిశీలించారు, సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్యూమరేషన్ ఫారమ్స్ BLO లకి జాగ్రత్తగా ఫిల్ చేసి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ, ఓటు హక్కు తోనే సమాజంలో మార్పు,ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అన్నారు. జాగ్రతగా సర్వే నిర్వహించాలి అని BLO లకి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సత్యం ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






