21 March, 2026 | 11:17 PM

కుమ్మేర బాధితులను బెదిరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి

21-03-2026 09:26 PM

బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ సాయి మహరాజ్

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): కుమ్మెర ఘటనలో బాధితులను ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ సాయి మహరాజ్ ఆరోపించారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ పేరుతో నోటీసులు ఇచ్చి బాధితురాలు మౌనికను విచారణకు పిలిచారు.

విచారణ సమయంలో సంఘటనకు సంబంధించిన విషయాలు అడగకుండా వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతూ, తన భర్తే పాపను చంపినట్టు చెప్పాలని సీఐ అశోక్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మౌనిక కులం గురించి కూడా ప్రశ్నిస్తూ ఆమెను ఒత్తిడికి గురి చేశారని పేర్కొన్నారు. తమకు పోలీసులపై నమ్మకం లేదని, న్యాయం చేయాలని కోరితే తమనే జైలుకు పంపేలా బెదిరిస్తున్నారని మౌనిక, గణేష్ తెలిపారు. అసలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా సాయి మహరాజ్ మాట్లాడుతూ బాధితులకు రక్షణ కల్పించకుండా ఇన్వెస్టిగేషన్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, బిసి జెఏసి అధ్యక్షులు విశారదన్ మహారాజ్ పై తప్పుడు కేసులు నమోదు చేసేలా ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసులో సీఐ అశోక్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులను విచారణ నుంచి తప్పించి, సంఘటనపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా డీఎస్‌యూ ఇంచార్జి శివ, జేఏసీ జిల్లా నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.