5 March, 2026 | 8:00 PM

మనుమళ్ళతో హోలీ సంబరాల్లో పాల్గొన్న పోచారం

05-03-2026 12:33 AM

బాన్సువాడ, మార్చి 4 (విజయ క్రాంతి): హైదరాబాదులోని బంజారాహిల్స్ లో తన కుటుంబ సభ్యులు, మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డి లతో   కలిసి బుధవారం స్వగృహంలో హోళీ సంబరాల్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, కామ దహనం చేసి, రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.