5 March, 2026 | 6:19 PM

ఆత్మకూర్ నూతన శివాలయం కోసం విరాళం

05-03-2026 12:34 AM

నాగిరెడ్డిపేట్, మార్చి4 (విజయ క్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన శివాలయం నిర్మాణం కోసం తనవంతు భాగంగా నాగిరెడ్డిపేట్ మండల బిజెపి నాయకురాలు కొండ  మీరాతాయి 21,000 ఒక్క వంద 11 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆత్మకూర్ గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు.

అలాగే గోపాల్పేట్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో గల సరస్వతి మాత విగ్రహానికి నూతన కలర్ వేయించడానికి 5000 రూపాయలు అందజేయడం జరిగిందని మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి తెలిపారు.

ఈ సందర్భంగా మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో గల దేవాలయాలు మనిషి జీవన విధానానికి, ఆధ్యాత్మితకు, సంస్కృతి, సంప్రదాయా లకు నిలువెత్తు నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, మరియు నాయకులు నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, సభ కృష్ణ తదితరులు ఉన్నారు.