11 May, 2026 | 9:42 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

చేనేత భూదానోద్యమ ప్రసిద్ధి పొందిన పోచంపల్లి

23-12-2025 09:07 PM

నకిరేకల్,(విజయక్రాంతి): చేనేత వృత్తి కళతో పాటు భూదానోద్యమ మహాయజ్ఞానికి పునాదిగా నిలిచిన చారిత్రక స్థలంగా పోచంపల్లి పట్టణం దేశంలోనే ప్రసిద్ధిగాంచినదని, విద్యార్థులు, పరిశోధకులు చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్ర విభాగాల్లో ప్రత్యేక అధ్యయనాలు చేయడానికి అనువైన క్షేత్రమని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ప్రిన్సిపాల్ డా.బెల్లి యాదయ్య అన్నారు. కళాశాల సామాజిక శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోచంపల్లి పట్టణంలో చారిత్రకత, వృత్తి విలువలు, సాంకేతికత, ఆర్థిక పుష్ఠి తొణికిసలాడుతుందని, చేనేత, వ్యవసాయం, మార్కెటింగ్ రంగాల్లో సమకూరిన స్వావలంబనతో ప్రజాజీవితం అబ్బురపరుస్తుందని కొనియాడారు.