గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి, జులై 9 (విజయ క్రాంతి): గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్వంత ఆదాయ వనరుల పెంపుతో పాటు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
మొరంచపల్లి వాగుపై రూ.320 కోట్లతో చెక్ డ్యామ్లు, పంట కాలువల లైనింగ్కు రూ.55 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సర్పంచులు ముందుండి సంవత్సరం వారీ ప్రణాళికలు అమలు చేయాలని, మిషన్ భగీర ద్వారా మంచినీటి సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






