24 April, 2026 | 3:13 AM

జాహ్నవి ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్

24-04-2026 01:44 AM

విద్యార్థుల ప్రతిభకు వేదిక

జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ నేతృత్వంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ, పీజీ కళాశాలలో లైఫ్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. డిగ్రీ, పీజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, రాత పరీక్ష,ఇంటర్వ్యూ ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేశారు.

కొంత మంది విద్యార్థులు తక్షణమే ఎంపిక కాగా, మరికొంతమంది తదుపరి దశల కోసం ఎంపిక చేయబడ్డారు.జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎ. పరమేశ్వర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించడం విశేషం. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికగా నిలిచింది.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలు, ఉద్యోగ అవకాశాలపై స్పష్టమైన అవగాహన కలిగింది.

ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విద్యార్థులు తమ సబ్జెక్ట్ పరిజ్ఞానం, విశ్లేషణా సామర్థ్యం, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహణలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సి బ్బంది సమన్వయంతో పనిచేసి, కార్యక్రమా న్ని విజయవంతం చేశారు. వారి సహకారం వల్ల విద్యార్థులకు మంచి అవకాశాలు లభించాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కెరీర్‌లో ముంద డుగు వేయాలని, భవిష్యత్తులో మరిన్ని సం స్థలతో కలసి పెద్ద ఎత్తున ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, ఉద్యోగ సాధనలో వారికి మార్గదర్శకంగా నిలిచింది.