24 April, 2026 | 3:14 AM

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో భారత్ ముందంజ

24-04-2026 01:49 AM

ఆధునిక చికిత్సలు, ముందస్తు గుర్తింపుపై.. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యుల సమగ్ర సీఎంఈ

హైదరాబాద్, 23 ఏప్రిల్ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో భారత్ ముందంజలో కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రతి సంవత్సరం సుమారు 2.48 లక్షల కేసులు నమోదవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ పెరుగుతున్న భారం దృష్ట్యా హైదరాబాద్‌లో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అడ్వాన్స్‌మెంట్స్ పేరిట సమగ్ర కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజీతో పాటు రీకన్స్ట్ర క్షన్ నిపుణులు పాల్గొని నోటి క్యాన్సర్, లా రింజియల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్లపై తాజా నిర్ధారణ, చికిత్స విధానాలపై విస్తృత చర్చలు జరిపారు.డాక్టర్ రవి చందర్ వెలిగేటి నోటి క్యాన్సర్లలో శస్త్రచికిత్స సూత్రాలపై వివరించగా, డా.నీలేష్ కందేరి నెక్ మేనేజ్ మెంట్ ఆధారిత వైద్య విధానాలను వివరించారు. డాక్టర్ ప్రజ్యోత్ రెడ్డి వూటుకూరి ఫంక్షనల్ రీకన్ట్స్రక్షన్‌లో వచ్చిన అభివృద్ధులను, శస్త్రచికిత్స తర్వాత రోగుల జీవన ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించారు.

డాక్టర్ డి. రామరాజు, డాక్టర్ నవీన్ కొక్కులా నోటి క్యాన్సర్ స్క్రీనింగ్, నివారణ, పునరావాసంపై అవగాహన కల్పించగా,డాక్టర్ కండ్ర ప్రసాంత్‌రెడ్డి, డాక్టర్ సరిత శ్రీవాస్తవ ఆధునిక రేడియోథెరపీ, సిస్టమిక్ థెరపీ విధానాలను వివరించారు. డాక్టర్ ఏ. వేణుగోపా ల్ పెరియోపరేటివ్ ఇమ్యూనోథెరపీ ప్రాముఖ్యతను వివరించారు. లారింజియల్ క్యాన్స ర్లలో అవయవ సంరక్షణ విధానాలపై డాక్టర్ కావిత ఉప్పాలా ప్రసంగించగా, డాక్టర్ జీవీ నాగార్జున రెడ్డి మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీ, సాల్వేజ్ లారింజెక్టమీ మధ్య తేడాలను విశ్లేషించారు.

డాక్టర్ అవినాష్ ఎండ్లా తెలియని మూలం నుంచి వచ్చే మెటాస్టాసిస్ కేసుల నిర్వహణలో సవాళ్లను వివరించారు. థైరాయిడ్ క్యాన్సర్ విభాగంలో డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి టీ రోబోటిక్ థైరాయిడెక్టమీపై, డాక్టర్ రవి చందర్ వెలిగేటి స్టాండర్డ్ ఓపెన్ థైరాయిడెక్టమీ విధానాలపై వివరించారు. చివరగా డాక్టర్‌జ్యోత్స్న మందారపు రేడియోయోడిన్ థెరపీ, అంతర్జాతీయ మార్గదర్శకా లపై తాజా సమాచారం అందించారు.

ఈ కార్యక్రమంలో రోగుల చికిత్సతో పాటు వారి జీవన నాణ్యతపై దృష్టి సారించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు గుర్తింపు, అవగాహన అత్యవసరమని నిపుణులు పేర్కొన్నారు. ఈ సీఎంఈ వైద్యుల మధ్య జ్ఞాన మార్పిడి కోసం ముఖ్య వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి బహుళ విభాగాల శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తూ, మెరుగైన క్యాన్సర్ చికిత్స సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.