calender_icon.png 11 February, 2026 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహింగ్యాల అక్రమ వలసలపై హైకోర్టులో పిటిషన్

11-02-2026 03:00:32 AM

మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 10(విజయక్రాంతి): హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారని మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరుణసాగర్ అనే న్యాయవాది బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ వలసలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.