calender_icon.png 11 February, 2026 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపోల్స్‌కు సర్వం సిద్ధం

11-02-2026 02:59:56 AM

  1. నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  2. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది 
  3. ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

మేడ్చల్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సిబ్బంది నియామకం నుంచి బూతులలో కనీస సదుపాయాల వరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, 48 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. 22,831 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 40 పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. 20454 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా 48 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 22,581 మంది హక్కు వినియోగించుకోనున్నారు. మూడు మున్సిపాలిటీలలో 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పి ఓ, ఏపీవో, ఓ పి ఓ లు 818 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 

పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది 

ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని డబిల్‌పూర్‌లోని భారత్ బైబిల్ కాలేజీలో, అలియాబాద్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మజీద్పూర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో, మూడు చింతలపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది అమ్మకు కేటాయించిన కేంద్రానికి చేరుకున్నారు. 

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన 

మూడు మున్సిపాలిటీలలో పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు నిర్మల క్రాంతి వెస్లీ, కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి సిబ్బందిని పోలింగ్ బూతులకు నిర్ణీత సమయంలో చేరుకునేలా చర్యలు తీసుకోవాల న్నారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేయాలన్నారు. 

భారీ బందోబస్తు 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ రోజున స్థానికేతరులు ఎవరు ఉండవద్దన్నారు. అల్లర్లు సృష్టించినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సిపి వెంట ఏసిపి శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఉన్నారు.

 సైబరాబాద్ పోలీస్  కమిషనర్ రమేష్ రెడ్డి