30 April, 2026 | 3:02 PM

జిల్లా టాపర్ గా నర్మేట విద్యార్థిని అమూల్య

30-04-2026 01:21 PM

నంగునూరు, విజయక్రాంతి: పదో తరగతి ఫలితాల్లో నర్మెట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బొమ్మిడి అమూల్య రికార్డు స్థాయి మార్కులతో మెరిసింది.మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన అమూల్య ప్రభుత్వ పాఠశాలల విభాగంలో 587 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి పి.శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినిని అభినందించారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో టాపర్ గా నిలవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్‌ఎం ఆకుల సత్యనారాయణ,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.