భారీ వర్షాలు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ., వైస్ చైర్మన్ అంతటి పుష్పలత...
సుల్తానాబాద్, జూలై 29(విజయక్రాంతి): రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత.తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసరమైతే నే బయటకు రావాలని, కరెంటు స్తంభాలు,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వద్దకు,తెగిపడిన కరెంటు వైర్ల వద్దకు వెళ్లకూడదని సూచించారు,.
నీరు ప్రవహించే ప్రాంతాలకు పిల్లలను వెళ్లకుండా చూడాలని అన్నారు.అలాగే చైర్మన్ బిరుదు రాధాకృష్ణ నాలుగో వార్డ్ 15వ వార్డులో లోతట్టు ప్రాంతాల్ని పరిశీలించారు, వార్డు ప్రజలను అప్రమత్తం చేస్తూ , వర్షపు నీరు ఎక్కడ నిలవకుండా కాలువలను క్లియర్ చేయించారు, చైర్మన్ వెంట కమిషనర్ రమేష్ , 15వ వార్డ్ కౌన్సిలర్ గాదాస్ మంజుల రవి పాల్గొన్నారు, ఏదైనా అత్యవసరమైతే కమిషనర్ కు , లేదా నాకు సమాచారం ఇవ్వాలని, ఈ నెంబర్లలో 739622 4440 ,6309532229 సంప్రదించాలని బిరుదు రాధాకృష్ణ కోరారు...






