30 July, 2026 | 1:55 AM

దేప భాస్కర్ రెడ్డిని కలిసిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులు

30-07-2026 01:04 AM

నాగోల్, జూలై 29 (విజయ క్రాంతి): కొత్తపేట రామకృష్ణాపురం డివిజన్ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, ఎన్టీఆర్ నగర్ డివిజన్ నూతన అధ్యక్షుడు ముప్పిడి లింగస్వామి గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చిలుక ఉపేందర్ రెడ్డితో కలిసి టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి నూతన అధ్యక్షులను అభినందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నూతన అధ్యక్షులు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.