ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి
- ఎమ్మెల్యే ముఠా గోపాల్
- ఘనంగా గురుపౌర్ణమి పూజలు
ముషీరాబాద్, జూలై 29(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మీక సేవలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బుధవారం ముషీరాబాద్ లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పి. శ్రీధర్ చారి ఆధ్వర్యంలో గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్వామివారికి మహాహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతనం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను శ్రీధర్ చారి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, సీనియ ర్ నాయకులు సోమన్, దీన్ దయాల్ రెడ్డీ, మోహిన్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సదా, మహిళా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శోభా, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్‌లో..
భరత్‌నగర్‌లో బుధవారం గురుపౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరీ శంకర ఆలయ కమిటీ చైర్మన్ లింగం గుప్తా, రామకృష్ణ, కృపానంద్, వెంకటేష్ పాల్గొన్నారు.
భోలక్ పూర్‌లో..
భోలక్ పూర్‌లోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ హాజరై పూజలు చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి. సోమన్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భోలక్ ప్పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, మీడియా సెల్ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, యూత్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు సాయికుమార్, అర్జున్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో..
ఎల్బీనగర్ , జులై 29 : దక్షిణ షిరిడిగా ప్రసిద్ధి చెందిన దిల్సుఖ్నగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయినాథుడికి ప్రత్యేక అలంకరణలు, మహాభిషేకం, హారతులు,వేదమంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు నిర్వహించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు బాబా ఆశీస్సులు పొందేందుకు బారులు తీరారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువుల మార్గదర్శకత్వం సమాజ అభ్యున్నతికి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమన్నారు.
కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు మల్లయ్య, మాజీ కార్పొరేటర్ భవానీప్రవీణ్ కుమార్, నాయకులు గండి సన్నీ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, తిలక్ రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.- బాబాకు సీపీ సుమతి పూజలు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిరిడీ సాయిబాబా దేవాలయాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సందర్శించారు.
దేవాలయంలో జరుగుతున్న గురుపూజోత్సవం సందర్భంగా భక్తులకు కల్పించిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను కమిషనర్ గారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు,
సిబ్బందికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, భద్రతా పరంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అవసరమైన భద్రతా, ట్రాఫిక్ మరియు శాంతిభద్రతల ఏర్పాట్లు చేశామని సీపీ సుమతి పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకుల సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






