calender_icon.png 14 February, 2026 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ

14-02-2026 12:24:05 AM

జనగామ, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి)శుక్రవారం జనగామ, స్టేషన్ ఘన్పూర్ ము న్సిపాలిటీ ఓట్ల లెక్కింపు సరళి విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్టేషన్గన్పూర్ 18 వార్డులకు, జనగామ ము న్సిపాలిటీ లో 30 వార్డులకు జరిగిన ఎన్నికలు, కౌంటింగ్ సజావుగా, ప్రశాంత వాతావ రణంలో నిర్వహించుటకు కృషిచేసిన జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అభినందించారు.

అలాగే ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.జనగామ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు బీఈడీ కాలేజ్ హైదరాబాదు రోడ్డు లో అలాగే స్టేషన్గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు పల్లగుట్ట క్రాస్ రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజ్ నందు ప్ర శాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

సాధారణ అబ్జర్వర్ నరసింహారెడ్డి ,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అలాగే అదనపు కలె క్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్ ప ర్యవేక్షణలో  కౌంటింగ్ సరళి పారదర్శంగా , ని ష్పక్షపాతంగా ముగిసింఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించుటకు జనగామ మున్సిపాలిటీలో 30 టేబుల్స్ అలాగే స్టేషన్గన్పూర్‌లో 18 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌం టింగ్ సూపర్వైజర్లను,

అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు ఓట్ల లెక్కిం పు పూర్తి అయిన పిదప గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ఎన్నికైనట్లు ధ్రువ ప త్రాలను అందించారుకౌంటింగ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేసి, డిసిపి రాజమహేంద్ర నాయ క్ ఇతర ఉన్నత పోలీసు అధికారులు పర్యవేక్షించారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయినందున బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.