calender_icon.png 14 February, 2026 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం

14-02-2026 12:25:05 AM

24 వార్డులలో బీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్ర -1

బీఆర్‌ఎస్‌కు మద్దతుగా స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళి కృష్ణ 

బీఆర్‌ఎస్ 13, స్వతంత్ర 1, మొత్తం 14 వార్డులు

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 13: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, శేరిగూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాని ఏర్పాటు చేశారు. కాగా లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కాగా, ఎన్నికల లెక్కింపును రెండు రౌండ్స్‌గా విభజించి లెక్కించారు. 

మొదటి రౌండ్ లో  1వ వార్డు నుంచి 12 వరకు, రెండవ రౌండ్ లో 13 వార్డు నుంచి 24 వార్డు గా ఫలితాలను లెక్కించారు. మొదటి రౌండ్ లో  అధికార కాంగ్రెస్ మధ్య  నువ్వా నేనా అంటూ హోరాహోరీ పోరు కొనసాగింది.  రెండోవ రౌండ్‌లో బీఆర్‌ఎస్ కారు జోరు కొనసాగింది. కాగా మొదటి, రెండవ రౌండ్ కలుపు కొని కాంగ్రెస్ (8), బీఆర్‌ఎస్ (13), బీజేపీ (2), కాంగ్రెస్ రెబల్ (1) సాధించాయి.  

స్వతంత్ర (కాంగ్రెస్ రెబల్) అభ్యర్థి దాసరి మురళి కృష్ణ బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా బీఆర్‌ఎస్ క్యాంపులో చేరడంతో బీఆర్‌ఎస్ ప్రస్తుతం 14వార్డులతో చైర్మన్,  వైస్ చైర్మన్ పదవులు బీఆర్‌ఎస్ కు సొంతం కానుంది. కాగా మున్సిపల్  చైర్మన్,  వైస్ చైర్మన్,  గెలుపొందిన కౌన్సిలర్ లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ జనరల్ కావడంతో  చైర్మన్ గిరికి గట్టి పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది.

అందులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. టేకుల సుదర్శన్ రెడ్డి, ఆకుల యాదగిరి, జెర్కొని మమత రాజు, అల్వాల జ్యోతి వెంకటరెడ్డి పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇందు లో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డికి దగ్గరి ఉండే మమత రాజు పేర్లు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అదృష్టం ఎవ్వరిని వరించనుందో ఈ నెల 16 వరకు వెచిచూడాల్సిందే.