15 April, 2026 | 1:28 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ

15-04-2026 11:26 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddyతెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల AICC ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ ఛైర్మన్ల రెన్యూవల్, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జిల్లాలో జరిగే భేటీలు, జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రులపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో సహా పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఈ చర్చలు సాగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహం కూడా ఈ సమావేశంలో ఒక కీలక అంశంగా చర్చకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.