15 April, 2026 | 11:43 AM

దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక

15-04-2026 10:05 AM

మూడేళ్ల క్రితం BRS వైఖరి ఇదే.

హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. 2023 సెప్టెంబర్ లో తాను చేసిన పోస్టును కేటీఆర్ ట్యాగ్ చేశారు. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ అభిప్రాయం చెప్పామని, అందులో మార్పులేదని ఆయన స్పష్టం చేశారు. పునర్విభజనలో అన్యాయం జరిగేది దక్షిణాదిలో బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని కేటీఆర్ పోస్టు చేశారు. దేశంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండడం గర్వకారణమని కేటీఆర్ సూచించారు. ఢిల్లీ పాలకులు తమ మాటలు వింటారని నాడు కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ పాలకులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.