4 July, 2026 | 2:03 AM

హార్టికల్చర్‌లో స్టార్టప్ విప్లవానికి శ్రీకారం

04-07-2026 01:05 AM

- వినూత్న ప్రాజెక్టులతో మెరిసిన విద్యార్థులు 

- మూడు రోజుల వర్క్‌షాప్ విజయవంతం

గజ్వేల్, జూలై 3: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘హార్టికల్చర్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్‘ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డా. డి. రాజిరెడ్డి మాట్లాడుతూ హార్టికల్చర్ రంగంలో యువత ఆవిష్కరణలు, స్టార్ట ప్లు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులు రూపొందించిన జుజు ఫ్రూట్ పౌడర్, ఎడిబుల్ కోటింగ్ టెక్నాలజీ, న్యూట్రిబాక్స్ మమ్మా, న్యూట్రి సైకిల్ వంటి వినూత్న ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఐకార్జ్ సహకారంతో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో విద్యార్థు లు, పరిశోధకులు, యువ రైతులు స్టార్టప్ అవకాశాలు, సుస్థిర వ్యవసాయం, ఎంట్రప్రెన్యూ ర్షిప్, సాఫ్ట్ స్కిల్స్పై శిక్షణ పొందారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కన్సల్టెంట్ వీరాంజ నేయులు, ప్రొఫెసర్ మురళీకృష్ణ, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.