4 July, 2026 | 2:50 AM

పార్టీ బలోపేతానికి కృషిచేయాలి

04-07-2026 02:00 AM

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైగాల్లా నాగేశ్వర రావు

ముషీరాబాద్, జులై 3 (విజయక్రాంతి): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ (అథవాలే) బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైగాల్లా నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ ఏర్పాటుతో పాటుగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం ఎన్నికల వ్యూహాలపై చర్చించామన్నారు.

అదేవిధంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్ట్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాబోయే జిహెచ్‌ఎం ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని  తెలిపారు. ఈ  కార్యక్రమంలో నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ కొంపల్లి ప్రభుదాస్, సౌత్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. శ్రవణ్ కుమార్, స్టేట్ ప్రెసిడెంట్ పసుపుల రవికుమార్, స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సరిగోముల్ల స్నేహలత, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రత్న ప్రసాద్ పాల్గొన్నారు.